HNK: ఐనవోలు మండల కేంద్రానికి చెందిన వాకిటి విష్ణు వర్ధన్ బైక్పై వరంగల్ వైపు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఇవాళ మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.