SRPT: నూతన సంవత్సర వేడుకల పేరుతో అల్లర్లు, చట్టవ్యతిరేక చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ గురువారం హెచ్చరించారు. హద్దులు దాటితే తాటతీస్తామని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి పట్టణంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు, విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా డీజే సౌండ్ సిస్టమ్లు ఏర్పాటు చేయకూడదన్నారు.