NRML: కుంటాల మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా లింగురాం పటేల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడిగా ప్రవళిక (అందకూర్), సెక్రటరీగా రాజన్న (సూర్యాపూర్), కోశాధికారిగా సుహాసిని (లింబాబి)లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.