WGL: పట్టణంలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాస్ ఈరోజు తెలిపారు. మైక్రోబయాలజీ-2, కంప్యూటర్ సైన్స్-2, తెలుగు-1 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 27లోపు దరఖాస్తులు స్వీకరణ, 29న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నారు. అర్హతకు 55%, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులు అవసరమని పేర్కొన్నారు.