JGL: రాయికల్ మండలంలోని జగన్నాథ్‌పూర్ ఆదివాసీ గ్రామానికి చెందిన ఓ యువకుడు 14 నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశాడు. జగన్నాథపూర్ నాయకపుగూడెంలో చలికి వణికిపోతున్న నిరుపేద కుటుంబాలను చూసి చలించి పెందూరు కృష్ణానగర్ అనే యువకుడు ఆసరాగా నిలిచి మంగళవారం దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరచ శంకర పాల్గొన్నారు.