KMM: రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని అధికారులకు స్వేచ్ఛనిచ్చామని, ఇకపై నిర్లక్ష్యాన్ని సహించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా చేరాలని ఆదేశించారు.