KRNL: కోటేకల్ సమీపంలోని నగరవనం వద్ద బుధవారం సాయంత్రం కారు ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బోడబండకు చెందిన ఆటో భోజనాలు అందించి తిరిగి వస్తుండగా ఎమ్మిగనూరు నుంచి ఆదోని వైపు వెళ్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. గాయపడిన డ్రైవర్ను కారులో ఉన్నవారు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.