NLR: సంగం మండలం దువ్వూరు గ్రామంలోని చర్చిలో గురువారం క్రిస్మస్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. యేసు క్రీస్తు జన్మదినాన్ని స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు, బైబిల్ వచనాల పఠనం, ప్రార్థనా గీతాలతో చర్చ్ పరిసరాలు మార్మోగాయి. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులు-సోదరీమణులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.