NDL: జిల్లాలో నాఫెడ్ ద్వారా రూ.8వేల మద్దతు ధరతో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. జిల్లాలో 1.17 లక్షల ఎకరాల్లో 70,562 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం 25,200 టన్నుల కొనుగోలుకు అనుమతులు వచ్చాయని, డీసీఎంఎస్, సహకార సంఘాల ద్వారా ఈ సేకరణ జరుగుతుందని వెల్లడించారు. రైతులు వినియోగించుకోవాలన్నారు.