AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు దర్శనానికి వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 73,524 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.