TG: అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అనే సంస్థ జనవరి 8న హైదరాబాద్లో జాతీయ సదస్సు నిర్వహించనుంది. ‘శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో సమాచార పాత్ర-వికసిత్ భారత్ 2047 నిర్మాణం’ ఇతివృత్తంగా బి.ఎం.బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర ఆడిటోరియంలో జరగనుంది.