VSP: జీవీఎంసీ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను GVMC వెబ్ పోర్టల్ (gvmc.gov.in) ద్వారా సులభంగా చేసుకోవచ్చని కమిషనర్ కేతాన్ గార్గ్ తెలిపారు. ఈ పోర్టల్లో క్రెడిట్/డెబిట్/ నెట్ బ్యాంకింగ్ /UPI ద్వారా చెల్లించుకోవచ్చన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని విలువైన సమయం వృథా కాకుండా పన్నులు చెల్లింపు చేయవచ్చన్నారు.