NRPT: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ మొన్నటి సభలో నా తోలు తీస్తానంటూ మాట్లాడారని, మా సర్పంచులే నీ తోలు తీస్తారని అన్నారు. వస్తే నువ్వు కొడంగల్‌కు రా లేదా మా సర్పంచులే నీ చింతమడకకు వస్తారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చౌకబారు మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.