SDPT: జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న మేజర్, మైనర్ రిపేర్లను పరిశీలించారు. వాటర్ కనెక్షన్, టాయిలెట్స్‌లో ట్యాప్ లీకేజీలు చెక్ చేసుకోవాలన్నారు. రిపేర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి అయ్యేలా పని చేయించుకోవాలని సూచించారు.