JN: కేంద్ర ప్రభుత్వం మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రాంజీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు బుధవారం పాలకుర్తిలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న హాజరై మాట్లాడుతూ.. ఈ చట్టంలో కూలీలకు ఎవరు నిధులు చెల్లించాలనే స్పష్టత లేదని, జాబ్ కార్డులు చాలా తొలగించారన్నారు.