TG: సర్పంచ్ ఎన్నికల్లో సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయని.. మంత్రి వివేక్ విమర్శించారు. ముఖ్యంగా దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎవరికి వారు గ్రూపులు కట్టి పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల BRSకే లాభం అని కార్యకర్తలను హెచ్చరించారు. సిద్ధిపేటను కాంగ్రెస్ కంచుకోటగా మారుస్తానని తెలిపారు.