SRD: గ్రామ అభివృద్ధికి నూతన సర్పంచులు కృషిచేస్తూ తోడ్పడాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు. బుధవారం ఆయన నివాసంలో కంగ్టి మండలం చాప్ట కే సర్పంచ్ శివాజీ రావు, పాలకమండలి సభ్యులు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా వీరిని ఎంపీ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సంక్షేమ అభివృద్ధికి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని ఎంపీ సూచించారు.