CTR: STU పుంగనూరు పట్టణ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. పట్టణం లోని నాగపాళ్యం పాఠశాల ఆవరణంలో STU సంఘ సమావేశం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా మెలుపట్ల పురపాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, అధ్యక్షులుగా రాములురెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దేవకుమార్,ఆర్థిక కార్యదర్శిగా మంజుల ను సభ్యలు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.