యాదాద్రి: గ్రామ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. రామన్నపేట మండలం జనంపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన బండ సరోజన అంజిరెడ్డి, పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వారిని ఎమ్మెల్యే సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశలను నెరవేర్చాలని సూచించారు.