WGL: చెన్నారావుపేట(M) తిమ్మరాయిని పహాడ్కి చెందిన మంద చిత్ర రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైంది. మానుకోట పట్టణంలో ఇటీవల జరిగిన జోనల్ స్థాయి ఖో-ఖో పోటీలో చిత్ర పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ క్రమంలో ఆమె రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఆమెను స్థానికులు, ఉపాధ్యాయులు ఈరోజు సన్మానించారు.