WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. తెల్లవారుజామున 10 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 18 నుండి లో 10 డిగ్రీలు,19 న 11, 20న 11, 21న 12, 22న 11, 23న 11, 24న 10 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.