MBNR: ప్రాజెక్టులను పెండింగ్లోకి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే డీపీఆర్ వెనక్కి వచ్చిందని విమర్శించారు. కేంద్రం 45 టీఎంసీలు ఇస్తామన్నా రాష్ట్రం స్పందించలేదని ఆరోపించారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.