HYD: మహిళలకు ఎల్లప్పుడూ అండగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నిలుస్తుందని ఛైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. HYD కలెక్టరేట్లో నిర్వహించిన “నారీ న్యాయ్ – హియర్ హర్ ఔట్” బహిరంగ విచారణలో ఉద్యోగ, గృహ హింస, వివక్ష, ఆర్థిక, సైబర్ నేరాలకు సంబంధించిన మహిళల ఫిర్యాదులను కమిషన్ స్వీకరించింది. బాధితులకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.