మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది. తన వ్యాఖ్యలకు సంబంధించి శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అసోసియేషన్ తెలిపింది. కాబట్టి, ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరింది. శివాజీ క్షమాపణలు చెబుతున్న వీడియోను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.