ELR: ఏలూరు నగరంలోని చోడిదిబ్బ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 20 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలు చింతల విజయలక్ష్మి రెండు రోజుల క్రితం విశాఖలోని కుమార్తె వద్దకు వెళ్లగా, ఇవాళ తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని నగలు మాయమైనట్లు గుర్తించి ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.