HYD: సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా హైటెక్ సిటీలో కొత్త స్టాపేజ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. 14 రోజుల పాటు అంటే జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.