KNR: కరీంనగర్లో టూటౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పెరిగిన మహిళా సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక విశ్రాంతి గదులు, వసతులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.