KNR: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని మానకొండూరు మండలం పచ్చునూర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎంఈఓ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యకు తోడ్పడేలా బండి సంజయ్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.