KNR: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన డీఐఓ డా. సాజిదా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. కంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె విద్యార్థులను కోరారు.