2025లో హైదరాబాద్ 72వ మిస్ వరల్డ్ పోటీలకు వేదికై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. HITEX ఎగ్జిబిషన్ సెంటర్లో 110కి పైగా దేశాల సుందరీమణుల మధ్య జరిగిన ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. రాష్ట్ర సంస్కృతిని, పర్యాటక గొప్పదనాన్ని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పింది. ఈ మెగా ఈవెంట్ విజయవంతం కావడంతో, అంతర్జాతీయ వేదికలపై HYD కీర్తి ప్రతిష్టలు మరో మెట్టు ఎక్కాయి.