వికారాబాద్ నియోజకవర్గంలో 137 జీపీలకు 105 జీపీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండలం కోటాలగూడ గ్రామంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తుందన్నారు.