ATP: తాడిపత్రిలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ర్యాలీని ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణ రక్షణకు కవచంలా పనిచేస్తుందని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.