MDK: క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రఖ్యాత మెదక్ చర్చ్ వద్ద శాంతిభద్రతల కోసం 500 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డీ.వీ శ్రీనివాస రావు మంగళవారం అన్నారు. కమాండ్ కంట్రోల్, సీసీ కెమెరాల నిఘా, షీ టీమ్లు, మఫ్టీ పార్టీలతో ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టామన్నారు. ప్రజల భద్రతపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తామన్నారు.