BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ నూతన సర్పంచ్ దంపతులు నాండ్రే సునీత-రవీందర్ ఇవాళ స్థానిక ఎమ్మార్వో లక్ష్మీరాజ్యం, ఎస్సై సాకాపురం దివ్య, సెకండ్ ఎస్సై షాఖాన్, ఎంఈవోలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వారిని శాలువాలతో సన్మానించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని సునీత-రవీందర్ కోరారు.