VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు టెక్ విద్యార్థులతో క్వాంటం టాక్ అనే కార్యక్రమం పెట్టి, భవిష్యత్తు భరోసా ఇచ్చే దిశగా మాట్లాడారన్నారు. ఈ సందర్బంగా జనవరి 2026 నాటికి అమరావతిలో భారతదేశపు మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభం కానుందని తెలిపారు.