ADB: కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి అని మండల వైద్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. మంగళవారం భీంపూర్ మండలంలోని కరంజి గ్రామంలో పర్యటించి కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. చర్మంపై పాలిపోయిన స్పర్శ లేని మచ్చలు, కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోయిన వంటి లక్షణాలు ఉన్నచో వైద్యులను సంప్రదించాలని కోరారు.