MBNR: కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల సమిష్టి కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో విజేత సర్పంచులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు.