SKLM: ఇచ్ఛాపురం మండల సరిహద్దు ప్రాంతంలో ధాన్యం అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు ముమ్మరం చేసినట్లు తహసీల్దార్ వెంకటరావు తెలిపారు. మంగళవారం పురుషోత్తపురం హైవే వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు. చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల తనిఖీలో నిర్లక్ష్యం వహించ వద్దని సూచించారు.