హిమాలయాల్లోని ఆల్పైన్ ప్రాంతాల్లో 4,000 నుంచి 4,800 మీటర్ల ఎత్తులో వృద్ధిచెందే ‘సిక్కిం సుందరి’ ఒక అద్భుతమైన మొక్క. దీని అసలు పేరు రీమ్ నోబిల్. పొడవైన, ఆకర్షణీయమైన పుష్ప కాండంతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ మొక్క కేవలం అందానికే కాకుండా, టిబెటన్ వైద్యంలో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. పుల్లని రుచి ఉండటంతో పాటు, శరీర ఉష్ణోగ్రతను పెంచే శక్తి కూడా ఈ మొక్కలో ఉంది.