SKLM: ఎచ్చెర్లలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రాంజీ మాట్లాడుతూ.. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. రక్తదానం ఇవ్వడం వలన మరొకరికి ప్రాణదాతలు అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని అభినందించారు.