NLR: సాల్వేషన్ ఆర్మీ పేదలకు చేసే సేవల్లో తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చెప్పారు. నెల్లూరు దర్గామిట్టలోని డీహెచ్ క్యూ ప్రాంగణంలో మంగళవారం సాల్వేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ ఈవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. చలికాలంలో పేదలకు దుప్పట్లు అందించడం ప్రశంసనీయమన్నారు.