AP: మాజీ ప్రధాని PV నరసింహారావు వర్థంతి సందర్భంగా హోంమంత్రి అనిత X వేదికగా పోస్టు చేశారు. ‘ఆర్థిక సంస్కరణలతో భారత నిర్మాణానికి బాటలు వేశారు. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలతో దేశాభివృద్ధికి బలమైన పునాది వేసిన వారి సేవలు సదా సంస్మరణీయం. బహుభాషావేత్తగా, పండితుడిగా భారత మేధస్సుకు ప్రతీకగా నిలిచిన PV తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం’ అని పేర్కొన్నారు.