MDK: పదవ తరగతిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేల నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. కొల్చారం హై స్కూల్‌ను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నలు, జవాబుల రూపంలో పరీక్షించారు. బోధనపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.