నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ‘పెరుగు చిలుకుట’ కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారికి పెరుగును సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.