ADB: గదిగూడ మండలం సంగ్వి పరిధిలోనీ బింజీ కొలం గూడలో మొత్తం 15 పీవీటీజీ గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో కనీసం రోడ్లు లేవు. త్రాగునీరు కోసం బిందెలు, బకెట్లు పట్టుకొని కిలోమీటర్ల దూరంగా వేలి చెలిమి నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామం ఏర్పడి 50 ఏళ్లు అవుతున్న ఏ అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.