ఆదిలాబాద్ రూరల్ మండలం తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) నూతన కమిటీని ఎన్నుకొన్నారు. 2025- 26 సంవత్సరానికి గాను మండల నూతన అధ్యక్షుడిగా దిలీప్, ప్రధాన కార్యదర్శిగా నారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యాయులు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు.