SDPT: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని మున్నూరు కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ పటేల్ కోరారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన గుర్రాలగొంది సర్పంచ్ ఆకుల స్వప్న-హరీష్‌ను సన్మానించి మాట్లాడారు. ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించినందున మంచి పనులు చేసి వారిమన్ననలు పొందాలని సూచించారు.