కృష్ణా: గోసాలలో సైబర్ మోసం ఘటన చోటుచేసుకుంది. ఫోన్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేసిన గుత్తేదారు క్షణాల్లోనే రూ. 3 లక్షలు కోల్పోయాడు. కాంట్రాక్టు పనులు చేసే రమేష్‌కు ఈ నెల 12న ‘వీనో–పేజాప్–ఎస్ పే’ పేరుతో మెసేజ్ వచ్చింది. అందులోని లింక్‌ను తెరిచిన వెంటనే ఆయన బ్యాంకు నుంచి రూ. 3 లక్షలు డ్రా అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో రమేష్ శనివారం పోలీస్‌లకు కంప్లైంట్ చేశారు.