VKB: జిల్లాలో చలి పంజా విసురుతుండటంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. వికారాబాద్ జిల్లాలో రాబోయే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని జిల్లాలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు చలి మంటలు వేసుకుని వెచ్చదనంతో ఉపశమనం పొందుతున్నారు. చిన్నారులు, వృద్ధులను చలి బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.