VKB: కొడంగల్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు మరియు తిరుప్పావై పారాయణం నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ధనుర్మాస పూజల సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.